మైకేల్ హస్సీ నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ పదవి ఖాళీగా మారింది. ఐపీఎల్ 2027 కోసం జహీర్ ఖాన్ను హెడ్ కోచ్గా నియమించిన సీఎస్కే, రైనాను బ్యాటింగ్ కోచ్గా తెచ్చే యోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సురేష్ రైనా స్పందించాడు. “ఆ విషయంపై ఇప్పుడే మాట్లాడలేను” అంటూ వ్యాఖ్యానించి సస్పెన్స్ మిగిల్చాడు. అలాగే రంజీల్లో రాణిస్తున్న మహమ్మద్ షమీ భారత జట్టులోకి త్వరలోనే తిరిగొస్తాడని రైనా ధీమా వ్యక్తం చేశాడు.


