సౌతాఫ్రికాతో డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్‌షా (190) చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. 124/6తో కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను నాథన్ లైయాన్, ప్యాట్ కమిన్స్‌ల సహకారంతో 390 పరుగుల కొండంత స్కోరుకు చేర్చాడు. 3500 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సెంచరీ బాదిన రెన్‌షా, 397 బంతులు ఎదుర్కొని డర్బన్ వేదికగా ఆస్ట్రేలియా టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ పునరాగమనాన్ని నమోదు చేశాడు. దీంతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది.


