తెలంగాణలో క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధనలు, అత్యాధునిక టెక్నాలజీ డెవలప్మెంట్కు కీలక అడుగులు పడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ, సింగరేణి సంస్థ, ఐఐటీ హైదరాబాద్ కలిసి ఈ రంగంలో సహకరించే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఖనిజాల అన్వేషణ, వెలికితీత, ప్రాసెసింగ్, రిఫైనింగ్‌తో పాటు మైనింగ్ వ్యర్థాల నుంచి క్రిటికల్ మినరల్స్‌ను తిరిగి పొందే టెక్నాలజీలపై ఈ 3 సంస్థలు దృష్టి పెట్టనున్నాయి. దీని కోసం సింగరేణి బృందానికి మోనాష్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది.


