తెలంగాణలో మళ్లీ వర్షాలు జోరందుకుంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తుండగా.. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురుస్తుండగా.. రానున్న మరికొన్ని గంటల్లో నగరంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.


