VI Data Sharing Offer: ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ డేటా ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డేటా అయిపోతే పెద్ద మొత్తంలో చెల్లించి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే, తక్షణ అవసరాలకు ఉపయోగపడేలా వొడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. వీఐ ప్రీపెయిడ్ యూజర్లు తమ డేటా నుంచి కొంత మొత్తాన్ని తమ కుటుంబ సభ్యులకు పంపించేలా ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 500ఎంబీ వరకు డేటాను పంపించుకోవచ్చని తెలిపింది. అయితే, అందుకు కొన్ని షరతులు ఉన్నాయి. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.


