JK Max Paints: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానుంది. సూర్యాపేట జిల్లాలో జేకే మ్యాక్స్ పెయింట్స్ కంపెనీ రంగుల ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. శనివారం జరిగిన బోర్డు సమావేశంలో ఇందుకు ఆమోదం లభించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏడాదికి 75,000 కిలో లీటర్ల పెయింట్ తయారీ సామర్థ్యంతో ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


