హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్ వేదికగా హీరో విశ్వక్ సేన్ నిర్వహించిన అభిమానుల సమావేశం తీవ్ర గందరగోళం మధ్య అర్ధాంతరంగా రద్దయింది. ఆదివారం కావడంతో అంచనాలకు మించి వేలాదిగా అభిమానులు తరలిరావడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దాదాపు వెయ్యి మందికి పైగా ఫొటోలు ఇచ్చిన అనంతరం, భద్రతా కారణాల దృష్ట్యా ఫొటోషూట్‌ను ఆపేసి విశ్వక్ సేన్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ సినిమా ఫ్లెక్సీలను చించివేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న తొలి భారతీయ యాక్షన్ స్లాషర్ థ్రిల్లర్ ‘కల్ట్’ అక్టోబర్ 30న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Cult: చేతులెత్తేసిన నిర్వాహకులు.. ఫ్యాన్స్ మీట్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన విశ్వక్ సేన్
RELATED ARTICLES


