Home Blog Page 61

త్వరలో ఏపీ ఎన్నికల గుట్టు విప్పుతా.. స్టడీ చేస్తున్నా.. 2 వారాల్లో వస్తా : ప్రకాశ్ రాజ్ సంచలనం

ఓటర్ల జాబితా ప్రక్రియపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. SIR ప్రక్రియపై ఆయన హైదరాబాద్‌లోని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై రీసెర్చ్ చేస్తున్నానని ఆయన చెప్పారు. దాని గురించి రెండు వారాల్లో మాట్లాడతానని అన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ విషయంలో ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే, బీజేపీ కూటమి పార్టనర్స్ ఏమి చేస్తున్నారని క్వశ్చన్ చేశారు.

పురిటి నొప్పులు భరిస్తూ.. 8 కిలో మీటర్లు డోలీలో గర్భిణీ నరకయాతన..!

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. అమ్మవారి ధారకొండ పంచాయతీ తడకపల్లి గ్రామానికి చెందిన కొర్రా మంగరాజు భార్య డామిని (27) నిండు గర్భిణిని వారి కుటుంబ సభ్యులు డోలీలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలించారు. ఆ డోలీలో ఆమె 8 కిలోమీటర్ల పాటు నొప్పులను భరిస్తూనే ఉంది. శ్యామగెడ్డకు చేరుకున్న తర్వాత అక్కడ జీపులో చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి ఆమెను తరలించారు. అక్కడ ఆడపిల్లకి ఆమె జన్మనిచ్చింది. ఈ ఘటన ఎంతోమందిని కలచివేస్తుంది.

బొత్సను కూడా ఇలాగే సస్పెండ్ చేస్తారా.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు సవాల్

Baddukonda Appalanaidu Comments Ys Jagan Mohan Reddy: విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అనుచరులు కూడా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఇవాళ అప్పలనాయుడు అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ తీరుపై అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్జి శ్రీను వియ్యంకుడినని తనను సస్పెండ్ చేశారని.. బొత్స కూడా శ్రీనుకు బంధువని, కాబట్టి ఆయన్ను కూడా సస్పెండ్ చేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tirupati: శ్రీసిటీలోని పరిశ్రమలో పేలుడు.. నలుగురు కార్మికుల మృతి

Tirupati Sri City Boiler Blast Four Died: తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో బాయిలర్‌ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. మరికొందరు కార్మికులు గాయపడ్డారు. ఒక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకి తరలించారు. మృతుల్లో.. తమిళనాడుకు చెందిన ఇద్దరు కార్మికులు, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒకరు, ఏపీకి చెందిన ఒకరు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మతం మారితేనే పెళ్లి చేసుకుంటా.. లేకుంటే ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తా.. హైదరాబాద్‌ యువకుడ్ని అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు

Tirupati Police Arrested Hyderabad Student For Marriage Fraud: పెళ్లి పేరుతో ఓ ఎంబీబీఎస్ విద్యార్థినిని మోసం చేసిన హైదరాబాద్ యువకుడిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు జార్జియాలోొ ఎంబీబీఎస్ చదవగా ఇద్దరు ప్రేమించుకున్నారు. యువతి పెళ్లి చేసుకుందామని అడిగితే.. ఆ యువకుడు ఆమెను మతం మారాలన్నాడు. లేకపోతే ప్రైవేటు ఫొటోలు, వీడియోలతో బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు హైదరాబాాద్ వెళ్లి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

SRI KASHI NAYANA DAILY – 3 అక్టోబర్ 2026

గాంధీజీని ఆదర్శంగా తీసుకోవాలి – మంత్రి సత్యకుమార్ యాదవ్ –CMRF చెక్కుల పంపిణీ:

వైసీపీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రత చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

చట్టాన్ని గౌరవిస్తేనే మనకు రక్షణ – జడ్జి వెంకటేశ్వర్లు

నా మనవడు చిన్ని చేతుల మీదుగా విరాళం ఇవ్వడం నా అదృష్టం.. విలువలో చిన్నదైనా సరే: నాగబాబు

Mlc Nagababu Donated Rs 1 Lakh To Tirumala Anna Prasadam: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ నాగబాబు తన భార్య పద్మజ, కుమార్తె నిహారిక, కొడుకు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళం అందించినట్లు నాగబాబు ట్వీట్ చేశారు. తన మనవడి చేతుల మీదుగా విరాళం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.

తిరుమలలో రెండు రోజులు పాటూ శ్రీవాణి దర్శన టికెట్లు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

TTD Tirumala Srivani Current Booking Closed On Saturday Sunday: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. టీటీడీ రెండు రోజుల పాటూ శ్రీవాణి దర్శన టికెట్లను రద్దు చేసింది. శనివారం, ఆదివారం శ్రీవాణి కరెంట్ బుకింగ్ శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ అందుబాటులో ఉండదని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమరావతిలో గ్రామకంఠాలు.. మినహాయింపులు పునఃపరిశీలన.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు

AP Cm Chandrababu On Amaravati Grama Kantams: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని గ్రామాల్లో 2014-19 మధ్య ఇచ్చిన గ్రామకంఠాల మినహాయింపులు పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నారాయణణు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు గ్రామకంఠాలను మరోసారి పరిశీలించనున్నారు. 2014-2019 మధ్య కొందరికి నిబంధనలకు విరుద్ధంగా మినహాయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వీటిని మరోసారి పరిశీలించాలని సూచించారు. అలాగే అమరావతిలో రైతులక రిటర్నబుల్ ప్లాట్లను కూడా పంపిణీ చేస్తున్నారు.

తిరుమలలో బైక్ రైడ్స్‌కు నో ఎంట్రీ?.. ఆ యాప్‌లలో తిరుమల ఆప్షన్‌ కనిపించకుండా ఉండేలా ఆలోచన?

Tirumala Bike Rides Ban Soon: హైదరాబాద్‌కు చెందిన సునీల్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత గత నెల 26వ తేదీన తిరుపతి ఎయిర్‌పోర్టుకు రాపిడో బైక్‌ను బుక్‌ చేసుకున్నారు. తిరుమల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే క్రమంలో.. తిరుమల మొదటిఘాట్‌రోడ్డులోని 26వ మలుపు వద్ద వేగంగా బైక్ క్యాష్‌బారియన్‌ను ఢీకొనడంతో రాపిడో రైడర్ అక్కడే చనిపోయారు. ఈ ఘటనలో సునీల్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో టీటీడీ ప్రైవేట్ యాప్‌ల ద్వారా బైక్ రైడ్‌లను నిషేధించాలని ఆలోచన చేసింది.