అంగారకుడు మిథునరాశిలోకి ప్రవేశించడంతో రాబోయే 25 రోజులు 4 రాశుల జాతకులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఇందులో మేషం, సింహం, ధనుస్సు, మకర రాశులున్నాయి.
జీహెచ్‌ఎంసీసహా పెండింగ్ మున్సిపాలిటీలకు ఎన్నికలు.. ముహూర్తం ఫిక్స్..? రెండో దశపై ప్రభుత్వం కసరత్తు
తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలను డిసెంబరులో నిర్వహించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతోపాటు గతంలో ఎన్నికలు జరగని ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్ ప్రక్రియలో నిమగ్నమైన పురపాలక సిబ్బందికి అక్టోబరు తర్వాత విరామం ఇచ్చి డిసెంబరులో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రీజినల్ రింగు రోడ్డు ఉత్తరభాగం పనులపై కీలక అప్డేట్.. టెండర్ల గడువు మరోసారి పొడిగింపు
తెలంగాణ రీజినల్ రింగు రోడ్డు ఉత్తరభాగం టెండర్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్‌పల్లి వరకు 161.518 కిలోమీటర్ల ఆరు వరసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. బిడ్‌ల గడువును పలుమార్లు పొడిగించిన అధికారులు తాజాగా సెప్టెంబరు 23 వరకు మరోసారి గడువు పెంచారు. ప్రాజెక్టుకు కేటాయింపులు, రహదారి నంబర్, కీలక అనుమతులు ఉన్నప్పటికీ టెండర్లలో జాప్యంపై రాష్ట్ర అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణపై ద్రోణి ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ
తెలంగాణలో ద్రోణి తరహా వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల తేమ ప్రభావంతో ఆగస్టు నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. కరీంనగర్‌కు విస్తరించే అవకాశం ఉందన్నారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

