ఎల్ నినో ప్రభావంతో ఆగస్టు నెలలో తెలంగాణలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. దీనివల్ల రాష్ట్రంలో 38 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.
తెలంగాణ ఎంపీల ఖాతాలో కోట్ల నిధులు.. అభివృద్ధి పనులు మాత్రం శూన్యం..!
తెలంగాణ ఎంపీలకు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగం జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా ఉంది. రాష్ట్రంలోని 23 మంది ఎంపీలకు రూ.394 కోట్లు కేటాయించగా.. సుమారు రూ.94 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు డేటా పేర్కొంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 56 శాతం వినియోగంతో ముందున్నారు. ఆరుగురు ఎంపీలు 10 శాతంలోపే ఖర్చు చేశారు. అయితే పనులకు సిఫారసులు చేసినా జిల్లా యంత్రాంగం అనుమతులు, పనుల అమలులో జాప్యం వల్లే తక్కువ వినియోగం నమోదవుతోందని ఎంపీల కార్యాలయాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ బడుల్లో ఇక నో బ్యాగ్ డే.. క్లాస్‌రూమ్‌కు బ్రేక్, క్రియేటివిటీకి ఛాన్స్
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పది బ్యాగ్ లెస్ డేస్ నిర్వహించనున్నారు. ఆ రోజుల్లో విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండా పాఠశాలకు హాజరై సైన్స్ ప్రయోగాలు, క్విజ్‌లు, క్షేత్ర పర్యటనలు, చిత్రలేఖనం, నాటికలు, బాలసభలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన మాడ్యూల్స్ ఆధారంగా ఈ కార్యక్రమాలు సాగుతాయి. పిల్లల్లో సృజనాత్మకత, ఆచరణాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలను పెంచడమే లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
7 ప్రశ్నలతో ఎవరికి వారే HIV టెస్టు చేసుకోవచ్చు.. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు..!
తెలంగాణలో సుమారు 1.50 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరిలో 1.30 లక్షల మంది చికిత్స పొందుతుండగా.. మరో 20 వేల మంది పరిస్థితిపై స్పష్టత లేదు. చికిత్సకు దూరంగా ఉన్నవారిని గుర్తించేందుకు టీసాక్స్ క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రారంభించింది. కోడ్ స్కాన్ చేసి ఏడు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే హెచ్‌ఐవీ రిస్క్ ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. రిస్క్ ఉన్నవారు ఏఆర్‌టీ కేంద్రాల్లో తదుపరి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 30 వేల మంది క్యూఆర్ విధానాన్ని వినియోగించారు.
చేయూత పెన్షన్ అప్లయ్ చేశారా.. నేడే చివరి తేదీ, ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?
తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్ల కోసం దరఖాస్తులు భారీగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం వరకు 4,34,854 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 2,64,815 మంది వితంతువులు ఉన్నారు. ప్రభుత్వం 2.50 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఐదు కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించారు. పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. మంగళవారం నుంచి అధికారులు దరఖాస్తుల వడబోత, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు అర్హతలను పరిశీలించి తుది లబ్ధిదారుల ఎంపికకు సహకరించనున్నారు.
ఆ మూవీని ఫ్యామిలీతో చూడకండి.. నేను మధ్యలోనే థియేటర్ నుంచి బయటకొచ్చా: ఎమ్మెల్యే రాజాసింగ్
టాక్సిక్ సినిమాపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. సినిమాలో అశ్లీలత, డ్రగ్స్, హత్యలు, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, సమాజానికి ఉపయోగపడే సందేశం కనిపించలేదని వ్యాఖ్యానించారు. స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన తాను కొన్ని సన్నివేశాల అనంతరం మధ్యలోనే బయటకు వచ్చానని తెలిపారు. ఇరుముడి, ఛావా వంటి సినిమాలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ దేశభక్తి, ఆధ్యాత్మికత, చారిత్రక విలువలతో కూడిన చిత్రాలు రావాలని సూచించారు.

