Home Blog Page 199

Irumudi Box Office Collection: ఇరుముడి బ్లాక్‌బస్టర్.. రెండు రోజుల్లోనే బ్రేక్ఈవెన్.. మూడు రోజుల్లో రూ.75 కోట్లు..

Irumudi Box Office Collection: రవితేజ ఇరుముడి మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ సినిమా తొలి వీకెండ్ లో ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. అటు అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్ లోనూ చేరింది.

SS Rajamouli: రాజమౌళిని కాస్త ఈ సినిమా చూడమని చెప్పండి.. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని ఉంది: నాగవంశీ

SS Rajamouli: టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను రాజమౌళి చూడాలని, ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. దీనికోసం కార్తికేయకు ఓ రిక్వెస్ట్ పంపించారు.

ఆగస్టు 28న చంద్రుడు 96 శాతం వరకు కప్పబడనున్నాడు.. చంద్రగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి!

2026లో రెండోది, చివరిది అయిన చంద్రగ్రహణం ఆగస్టు 28న సంభవించనుందని ఈ కథనం పేర్కొంటోంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం కాగా, భూమి నీడ చంద్రుడి ఉపరితలంలో దాదాపు 96 శాతం వరకు కప్పివేస్తుందని వివరించింది. గ్రహణ సమయంలో చంద్రుడు ముదురు నారింజ రంగులో కనిపించే అవకాశం ఉంటుంది.

ఆగస్టు 28న ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. మీ రాశిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న కుంభ రాశిలో ఏర్పడనుంది. భారత్‌లో ఇది కనిపించనప్పటికీ, కొన్ని రాశుల వారిపై దీని ప్రభావం స్పష్టంగా ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. తెలంగాణలోకి ఫారెన్ బీర్లు, లగ్జరీ లిక్కర్..!

0

తెలంగాణ మద్యం మార్కెట్లోకి 18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 కొత్త బ్రాండ్లు ప్రవేశించేందుకు రెడీ అవుతున్నాయి. గ్లెన్‌ఫిడిక్‌, ది మెకాలన్‌ సింగిల్‌ మాల్ట్‌లు, లూయిస్‌ థర్టిన్‌ కాగ్నాక్‌, మంకీ షోల్డర్‌, హెండ్రిక్స్‌ జిన్‌, టైగర్‌ లాగర్‌ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లతోపాటు దేశీయ ప్రీమియం ఉత్పత్తులు జాబితాలో ఉన్నాయి. పారదర్శకత కోసం బ్రాండ్ల వివరాలు, కంపెనీలు సమర్పించిన పత్రాలను టీజీబీసీఎల్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ట్రేడ్‌మార్క్‌ లేదా ఇతర అభ్యంతరాలను సెప్టెంబర్‌ 1లోపు సమర్పించేందుకు అవకాశం కల్పించారు.

ఆటోలకు ప్రత్యేక యాప్, వెల్ఫేర్ బోర్డు, ఛార్జీల పెంపుపై ప్రభుత్వం హామీ.. సమ్మె విరమణ

0

తెలంగాణలోని ఆటో డ్రైవర్ల సంఘాలు తాము తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించుకున్నాయి. రవాణా శాఖ అధికారులు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఈఎంఐలు కట్టలేక కారు అమ్మేశా.. డబ్బు కోసం డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నా: ‘మై విలేజ్ షో’ అంజి మామ

0

జీవితం అంతా ఈజీ కాదని మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమస్ అయిన అంజి మామ వెల్లడించారు. అనుకున్నవి అనుకున్నట్లు ఎప్పుడూ జరగవి అన్నారు. తన 14 ఏళ్ల యూట్యూబ్ కెరీర్‌లో సంపాదించింది జీరో అని వెల్లడించారు. మై విలేజ్ షో స్టార్ చేసిన తన మేనల్లుడు శ్రీకాంత్‌తో చిన్న చిన్న విభేదాల కారణంగా బయటకు వచ్చానని.. ఆ తర్వాత డబ్బుల కోసం సినిమాల్లో వేషాలు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కుటుంబం కోసం ఖాళీ సమయాల్లో డ్రైవింగ్‌తో పాటు ఎలక్ట్రీషీయన్ వర్క్ చేస్తున్నట్లు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Mahakali OTT: ప్రశాంత్ వర్మ మహాకాళి రికార్డు డీల్.. గ్లింప్స్ కూడా రాక ముందే నెట్‌ఫ్లిక్స్ సూపర్ ఆఫర్

Mahakali OTT: మహాకాళి మూవీ గ్లింప్స్ వీడియో కూడా బయటకు రాక ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.

Brahmamudi August 24 Episode: బ్రహ్మముడి.. ఇందుని ఇరికించిన ఐశ్వర్య.. పెళ్లి కాలేదని నిరూపిస్తానని.. రేఖకు టెన్షన్

Brahmamudi Serial August 24th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 24 ఎపిసోడ్ లో ఐశ్వర్యకు ఇందు ఓపెన్ ఛాలెంజ్ విసరగా.. ఆ ఛాలెంజ్ కు ఓకే చెప్పిన ఐషూ.. ఆ తర్వాత ఇందునే ఇరికిస్తుంది. అయితే అక్కచెల్లెళ్ల మధ్య రేఖలో టెన్షన్ మొదలైంది.

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- దీప కాళ్లపై పడిన జ్యోత్స్న- మాలిని ఇంట్లో సూరజ్, చూసిన కార్తీక్‌కు షాక్

Karthika Deepam 2 Serial August 24th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 24వ ఎపిసోడ్‌‌‌లో జ్యోత్స్నను దీప తన సొంత చెల్లి అనుకుంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న దీప కాళ్లపై పడి ఏడుస్తుంది. తను చేసిన పాపాలు కడిగేసుకోవాలంటే క్షమించాలని అడుగుతుంది. మాలిని ఇంట్లో కార్తీక్‌కు సూరజ్ కనిపిస్తాడు.