Home Blog Page 176

Mahindra Thar facelift : అదరగొట్టేలా మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్.. త్వరలోనే భారత మార్కెట్లోకి!

0

మహీంద్రా థార్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ త్వరలోనే​ లాంచ్​కు రెడీ అవుతోంది. థార్ రాక్స్ ప్రేరణతో వచ్చిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, లెవెల్-2 అడాస్, అప్‌డేటెడ్ డిజైన్‌తో రానున్న ఈ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

GAIL Recruitment 2027 : గేట్ స్కోర్‌తో గెయిల్​లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు- వివరాలివే..

0

మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ ‘గెయిల్ ఇండియా లిమిటెడ్’లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి. గేట్ 2027 స్కోర్ ఆధారంగా ఎంపిక చేసే ఈ కేంద్ర ప్రభుత్వ కొలువులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం ఇక్కడ చూడండి..

తమిళ సినిమా అద్భుతం.. ముఖ్యంగా యువత కచ్చితంగా చూడాలి: మంత్రి నారా లోకేష్ ప్రశంసలు

0
Nara Lokesh Praises Madhavan GDN Movie: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తమిళ మూవీపై ప్రశంసలు కురిపించారు. పారిశ్రామికవేత్త జీడీ నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన జీడీఎన్ బయోపిక్ చూసి అద్భుతం అంటూ పొగిడారు. జీడీ నాయుడు భారతదేశం ఎడిసన్‌గా అభివర్ణించారు. ఆవిష్కరణల పట్ల ఆయనకున్న అంకితభావం, పారిశ్రామికవేత్తగా సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమన్నారు లోకేష్. జీడీ నాయుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి ఎన్నో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు మంత్రి లోకేష్.

బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటూ వర్షాలు

0
Andhra Pradesh Weather Update Today: ఏపీకి వచ్చే రెండు రోజులు వానలు పడతాయని అంచనా వేసింది వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. వాయువ్య బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంటున్నారు.. వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.

రాశిఫలాలు 15 సెప్టెంబర్ 2026: ఇంద్ర యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశుల దశ తిరగనుంది!

0
రాశిఫలాలు 15 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ఇంద్ర, హంస యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది హనుమంతుడికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

Today Panchangam 15 September 2026: ఈరోజు నక్షత్రం, తిథి, శుభ ముహుర్తాలు, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే

0
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని పంచమి తిథి నాడు, మంగళవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జాక్‌పాట్ కొట్టిన సౌదీ అరేబియా.. పవిత్ర మదీనాలో భవిష్యత్‌ను శాసించేలా.. 110 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు

అరబ్ దేశం సౌదీ అరేబియా జాక్ పాట్ కొట్టింది. చమురు నిల్వలతో ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదిగిన సౌదీని.. ముడి చమురు నిల్వలు అడుగంటితే ఎలా అనే ప్రశ్న వెంటాడుతోంది. అందుకే గత కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించడంతోపాటు దేశంలో ఖనిజ నిల్వలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పవిత్ర మదీనా ప్రాంతంలో 110 మిలియన్ టన్నుల భారీ ముడి యురేనియం నిల్వలు ఉన్నట్లు సౌదీ గుర్తించింది.

ఆసియాకప్ ఫైనల్‌లో సెండాఫ్.. భారత పేసర్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ..!

0
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించిన వేళ భారత ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్‌కు ఐసీసీ షాకిచ్చింది. ఫైనల్ మ్యాచ్ తొలి ఓవర్‌లో లంక ఓపెనర్ ఇమేషా దులానీ వికెట్ తీసిన అనంతరం పెవిలియన్ వైపు వెళ్లాలని సైగ (సెండ్-ఆఫ్) చేసింది. అయితే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద ఆమె మ్యాచ్ ఫీజులో 10% కోత విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ కేటాయించారు. క్రాంతి తన తప్పును ఒప్పుకోవడంతో దీనిపై విచారణను ముగించింది.

కోలుకున్న వారానికే మళ్లీ గాయం.. ఆఫ్ఘన్ సిరీస్ నుంచి వరుణ్ చక్రవర్తి ఔట్!

0
ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సైడ్ స్ట్రెయిన్ (కండరాల గాయం) కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రెండ్రోజుల క్రితమే బెంగళూరు సీఓఈ నుంచి ఫిట్‌నెస్ సాధించి తిరిగొచ్చిన వరుణ్, తొలి మ్యాచ్‌లోనే మళ్లీ గాయపడ్డాడు. దీంతో త్వరలో జరగబోయే ఆసియా క్రీడలకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేది బీసీసీఐ మెడికల్ స్కానింగ్ తర్వాత తేలనుంది.

అల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఉపయోగపడే ఇంటి చిట్కాలు!

0
అల్లం లేకుండా చాలా ఇళ్లలో రోజు వంట పూర్తవదు. టీకి, కూరలకు, చట్నీలకు, మసాలా కూరల్లో, పులుసులకు అల్లం తరచూ వాడుతుంటాం. అందుకే మార్కెట్‌ నుంచి ఒకేసారి ఎక్కువగా తెచ్చుకుంటాం. కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత అల్లం మెత్తగా మారడం, ముడుచుకుపోవడం, బూజు పట్టడం మొదలవుతుంది. దీంతో వాడాల్సిన అల్లం కూడా వృథాగా పడేయాల్సి వస్తుంది. అయితే అల్లాన్ని ఎలా నిల్వ చేస్తున్నామనే దానిపై అది ఎంతకాలం తాజాగా ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని Food Nutrition అధ్యయనం పేర్కొంది. సరైన పద్ధతిలో నిల్వ చేస్తే కొన్ని వారాల పాటు, కొన్ని పద్ధతుల్లో నెలల పాటు కూడా అల్లాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి అల్లం త్వరగా పాడవకుండా ఇంట్లో ఎలా స్టోర్ చేయాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..