రాశిఫలాలు 16 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు వైధ్రుతి, విష్కంభ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది వినాయకుడికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ‘కళానిధి’ యోగం ఏర్పడనుంది. అదేవిధంగా చంద్రునిపై గురు గ్రహం తన ద్రుష్టిని ప్రసరింపజేయడం వల్ల ‘నీచభంగ రాజయోగం’ ఏర్పడనుంది. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం, తులా సహా ఈ రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
ఆఫ్ఘన్‌కు వరుసగా పదో ఓటమి.. టీ20ల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిన భారత్!
టీ20 క్రికెట్‌లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20లో భారత్ విజయం సాధించడంతో, ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ఓటములు చవిచూసిన టీమ్స్‌లో ఆఫ్ఘన్ (10 వరుస ఓటములు – 2010 నుంచి 2026) అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ (9 ఓటములు – 2019 నుంచి 25), జింబాబ్వే (8 ఓటములు – 2024 నుంచి 26 వరకు) ఈ జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
సంజూ ఊర మాస్ కమ్‌బ్యాక్.. రెండో టీ20లోనూ ఆఫ్ఘన్ చిత్తు..!
ఢిల్లీలో జరిగిన 2వ టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 160 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్, సంజు శాంసన్ (22 బంతుల్లో 57), అభిషేక్ శర్మ (19 బంతుల్లో 39), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 38 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో 14.5 ఓవర్లలోనే 1633 చేసి మ్యాచ్ ముగించింది. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్.. 7.85 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్లకు జీఓ జారీ
ఏపీలో అసైన్డ్, ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో చట్టబద్ధంగా ఫ్రీహోల్డ్ హక్కులు పొందిన 7.85 లక్షల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పొరపాటున అసైన్డ్‌గా నమోదైన 5,422 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములకు కూడా రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించింది. ఫ్రీహోల్డ్‌కు అర్హత ఉన్నా ఉత్తర్వులు వెలువడని 64,143 ఎకరాలకు ప్రత్యేక ప్రక్రియ.. చుక్కల భూముల పరిధిలోని 17,897 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చారు.
పీరియడ్స్ టైమ్‌లో ఓవర్ బ్లీడింగ్ అయితే మెనుస్ట్రువల్ కప్ ఎలా హెల్ప్ చేస్తుంది? కప్ లీక్ కావొద్దొంటే ఏం చేయాలి?
పీరియడ్స్ అనగానే చాలా మంది ఆడవారు భయపడిపోతారు. నెలలో దాదాపు ఐదురోజుల పాటు సాగే ప్రక్రియలో బ్లీడింగ్ అవుతుంది. ఇది కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆడవారు ఓ వయసుకి రాగానే మొదలయ్యే ఈ పీరియడ్స్ మెనోపాజ్ స్టేజ్ వరకూ నెలనెల పలకరిస్తూనే ఉంటాయి. ఈ టైమ్‌లో వారు ఎంత కంఫర్ట్‌గా ఉంటే అంత బాగుంటుంది.
పీరియడ్స్ కోసం ఇదివరకటి రోజుల్లో గుడ్డలు వాడేవారు. తర్వాత ప్యాడ్స్ వచ్చాయి. రోజులు గడిచేకొద్దీ టాంపూన్స్, మెనుస్ట్రువల్ కప్స్ వచ్చాయి. పీరియడ్స్‌లో ఒక్కొక్కరు ఒక్కోదాన్ని సెలక్ట్ చేసుకుని పీరియడ్స్‌ని ఈజీగా మార్చుకుంటారు. పీరియడ్స్‌ని సులభంగా మార్చడంలో మెనుస్ట్రువల్ కప్ ముందుంటుంది. ఇది సిలికాన్ రబ్బర్. దీనిని ఒక్కసారి కొంటే సంవత్సరాల కొద్దీ వాడొచ్చు. తక్కువ ఖర్చు. పైగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. ఎంతో కంఫర్ట్‌గా కూడా ఉంటాయి. మిగతావాటితో పోలిస్తే మెనుస్ట్రువల్ కప్‌లో లీకేజీలు తక్కువగా ఉంటాయి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మెనుస్ట్రువల్ కప్‌ని ఎలా వాడాలో తెలిసి ఉండాలిగా. దానికోసం కొన్ని చిట్కాలు.
పీరియడ్స్ కోసం ఇదివరకటి రోజుల్లో గుడ్డలు వాడేవారు. తర్వాత ప్యాడ్స్ వచ్చాయి. రోజులు గడిచేకొద్దీ టాంపూన్స్, మెనుస్ట్రువల్ కప్స్ వచ్చాయి. పీరియడ్స్‌లో ఒక్కొక్కరు ఒక్కోదాన్ని సెలక్ట్ చేసుకుని పీరియడ్స్‌ని ఈజీగా మార్చుకుంటారు. పీరియడ్స్‌ని సులభంగా మార్చడంలో మెనుస్ట్రువల్ కప్ ముందుంటుంది. ఇది సిలికాన్ రబ్బర్. దీనిని ఒక్కసారి కొంటే సంవత్సరాల కొద్దీ వాడొచ్చు. తక్కువ ఖర్చు. పైగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. ఎంతో కంఫర్ట్‌గా కూడా ఉంటాయి. మిగతావాటితో పోలిస్తే మెనుస్ట్రువల్ కప్‌లో లీకేజీలు తక్కువగా ఉంటాయి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మెనుస్ట్రువల్ కప్‌ని ఎలా వాడాలో తెలిసి ఉండాలిగా. దానికోసం కొన్ని చిట్కాలు.
చైనా కోసం నిత్యం వందలాది గాడిదలను వధిస్తున్న పాకిస్థాన్
పర్వతాలు, ఎత్తైన ప్రాంతాల్లో సరకులతో పాటు మనుషుల రవాణాకు గాడిదలను వినియోగిస్తారు. అయితే, గాడిద మాంసానికి చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిని అక్కడ విలాసవంతమైన ఆహారంగా భావిస్తారు. దీనిని పాకిస్థాన్ తనకు అనుకూలమైన వ్యాపారంగా మార్చుకుంటోంది. బలూచిస్థాన్‌లోని పొడి నెలల్లో గాడిదల పెంపకం చేపట్టి, వాటి మాంసాన్ని చైనాకు సరఫరా చేస్తోంది. అలాగే, వాటి చర్మాన్ని ఉడకబెట్టడం ద్వారా వచ్చె కొల్లాజెన్‌ను కొన్ని రకాల ఔషధాల్లో ఉపయోగిస్తారు. దీంతో వాటికి గిరాకీ ఎక్కువగా ఉంది.
బౌలింగ్‌తో ఆఫ్ఘన్ బ్యాటర్లను వణికించిన నితీశ్ రెడ్డి.. స్కోరు ఎంతంటే..!
ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న 2వ టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, ఆఫ్ఘనిస్థాన్‌ను 20 ఓవర్లలో 159/8 పరుగులకే పరిమితం చేసింది. తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (3/24) టాప్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్ 2, బుమ్రా, అక్షర్, రవి బిష్ణోయ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో కెప్టెన్ జద్రాన్ (37), రషీద్ ఖాన్ (28) రాణించారు. ఈ సిరీస్ తొలి మ్యాచులో భారత్ విజయం సాధించింది.
డానిష్ టెక్నాలజీతో రోడ్లపై గుంతలకు చెక్.. ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో.. ఎలా పనిచేస్తుందంటే?
వర్షాలు, భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లపై ఏర్పడే గోతులు, పగుళ్ల సమస్యకు కొత్త పరిష్కారాన్ని పరీక్షిస్తున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లాలో ముడిగేడు-సంజామల రహదారిపై డానిష్ ఫైబర్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. డానిష్ ఫైబర్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ విధానంలో అరామిడ్, పాలీఓలిఫిన్ ఫైబర్స్‌ను ఆస్ఫాల్ట్‌లో కలిపి రోడ్డును అంతర్గతంగా బలోపేతం చేస్తారు. దీంతో పగుళ్లు, భారీ వాహనాల వల్ల ఏర్పడే గాడులు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీ వినియోగంపై స్పష్టత రానుంది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ముందడుగు.. ఓటర్ల జాబితా ప్రచురణపై ఎస్ఈసీ కీలక ప్రకటన
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తొలుత పురపాలక ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన పరిపాలనా, ఎన్నికలపరమైన ఏర్పాట్లను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ త్వరలోనే పూర్తికానుంది. అనంతరం ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను ఎస్ఈసీ చేపట్టనుంది. ఈ క్రమంలో మరో 41 కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఓటర్ల జాబితా తయారీకీ నోటిఫికేషన్లు జారీ కానుంది.

