Home Blog Page 159

ఫ్యాటీ లివర్‌ తగ్గడానికి ఇంటి చిట్కాలు.. బ్లాక్‌ కాఫీ + అల్లం, పసుపు టీ + వెల్లుల్లి చాలు!

0
మారుతున్న లైఫ్‌స్టైల్‌, ఆహార అలవాట్ల వల్ల నేడు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఫ్యాటీ లివర్‌. కాలేయంలో అధికంగా కొవ్వు చేరడం వల్ల మొదలయ్యే ఈ సమస్య ప్రారంభంలో ఎలాంటి తీవ్రమైన లక్షణాలను చూపించదు. అయితే దీనిని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే క్రమేణా కాలేయ కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి తీవ్రమైతే ఫైబ్రోసిస్‌ లేదా సిర్రోసిస్‌ వంటి ప్రమాదకరమైన కాలేయ వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. కానీ సరైన సమయంలో లైఫ్‌స్టైల్‌ మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సులభంగా చెక్‌ పెట్టొచ్చు.

మన ఇంటి వంటగదిలోనే అందుబాటులో ఉండే కొన్ని సహజ పదార్థాలు కాలేయ ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి. రోజూ తాగా బ్లాక్‌ కాఫీ, అల్లం-పసుపు టీ, చిన్న వెల్లుల్లి రెబ్బలు తినడం వంటివి కాలేయంలోని కొవ్వును కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మందులపై ఆధారపడకుండా ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న సహజ చిట్కాలతో ఫ్యాటీ లివర్‌ సమస్యను ఇంట్లోనే సురక్షితంగా తగ్గించుకోవచ్చు.

కర్కాటక రాశిలో కుజుడి సంచారం వేళ రాబోయే 55 రోజులు ఈ 4 రాశులకు కీలకం

0
Mangal Gochar 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అంగారకుడు(కుజుడు)ని పెద్ద గ్రహంగా పరిగణిస్తారు. అంగారకుడిని అగ్నికి సంకేతంగా భావిస్తారు. అందుకే కుజుడి రవాణాకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో కుజుడు సెప్టెంబర్ 18న శుక్రవారం మిథున రాశి నుంచి చంద్రుడు అధిపతిగా ఉండే కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో సుమారు 55 రోజుల పాటు నివాసం ఉండి ఆ తర్వాత సూర్యుడు అధిపతిగా ఉండే సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కుజుడు, గురుడి మధ్య సంయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో ద్వాదశ రాశులకు కుజుడి బలహీన స్థితి, ప్రతికూల ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారికి కుజుడి ప్రభావంతో అనేక రంగాల్లో గణనీయమైన ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈ కాలంలో కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి శుభ ప్రదమైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారం, ఉద్యోగం మరియు కుటుంబ జీవితాలకు సంబంధించిన శుభవార్తలను వినే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి.

‘బ్రిక్స్‌’ నుంచి తిరిగెళ్లాక సౌతాఫ్రికా అధ్యక్షుడికి అనారోగ్యం.. జిన్‌పింగ్ ఆరోగ్యంపై వదంతులు.. భారత్‌పై కుట్ర..!

బ్రిక్స్ సదస్సులో పాల్గొని స్వదేశానికి చేరుకున్న సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫాసో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. మరోవైపు బ్రిక్స్ సదస్సు కోసం ఇండియా వచ్చిన చైనా అధ్యక్షుడు న్యూఢిల్లీలో స్ట్రోక్‌కు గురయ్యారని.. దీంతో ఆయన ప్రత్యేక విమానంలో చైనా వెళ్లి చికిత్స పొందుతున్నారంటూ వదంతులు కూడా వ్యాపించాయి. ఇదే అదనుగా బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రపంచ నేతలు అనారోగ్యానికి గురయ్యారని తప్పుడు ప్రచారం మొదలైంది.

ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రివర్షన్‌కే మొగ్గు.. రిటైర్డ్‌ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు

0
AP Housing Corporation Reposting Orders: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులకు ఊరట దక్కింది. తాజాగా వారికి రీ పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్పొరేషన్‌ ఉద్యోగు ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతో.. రిటైర్డ్‌ ఉద్యోగులు, అధికారులు తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతి తెలియజేశారు. వీరిలో చాలామందికి రీ పోస్టింగ్‌ ఆర్డర్లు ఇవ్వగా.. కొందరు ఉద్యోగుల రీపోస్టింగ్‌ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా రివర్షన్ ద్వారా వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు.

మిగిలిన మటన్, చికెన్‌ని ఫ్రిజ్‌లో ఎలా స్టోర్ చేయాలి, ఫుడ్‌ని ఫ్రిజ్‌లో పెట్టాలనుకుంటే పాటించాల్సిన చిట్కాలు

0
ఫుడ్ ఎప్పుడైన సరైన టెంపరేచర్‌లో వండకపోవడం, సరికాని టెంపరేచర్‌లో బయట ఉంచడం అనేవి రెండూ కూడా ఆరోగ్యం పాడవ్వడానికి కారణాలు. ఫుడ్‌తో వచ్చే సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మిగిలిన ఫుడ్‌ని ఎలా స్టోర్ చేసి తీసుకోవాలనేది తెలిసి ఉండాలి. మిగిలిన ఆహారాన్ని సరైన విధంగా స్టోర్ చేయడానికి USDA సూచించే సలహాల గురించి తెలుసుకోవాలి.
అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే మిగిలినవి ఏ ఆహారం అనేదాని బట్టి దానిని స్టోర్ చేయాలా వద్దా అనేది తెలిసి ఉండాలి. పచ్చళ్ళ వంటివాటిని ఫ్రీజ్ చేసి వాడుకోవచ్చు. అదే అన్నం వంటి వాటిని అలా చేయడం సరికాదుగా. అందుకే, మనం వేటిని స్టోర్ చేస్తున్నామనేది మన విజ్ఞతకే తెలిసి ఉండాలి. వాటిని అలా స్టోర్ చేసి ఎన్నిరోజులు వాడుకోవచ్చు. అనేది మనకి మనంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదే విధంగా, వండిన వంటల్ని సరిగ్గా స్టోర్ చేయడానికి ముందుగా మనం వాటిని ఎలా వండామనేది కూడా తెలుసుకుని వాడాల్సిందే. వాటిని వండేటప్పుడు సరైన టెంపరేచర్‌లో ఉడికిందో లేదో తెలుసుకోవాలి. దీనికోసం ఫుడ్ థర్మామీటర్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి, మీరు గనుక మిగిలిన ఫుడ్‌ని స్టోర్ చేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా ఫుడ్ థర్మామీటర్‌ని వాడాల్సిందే. వీటి ద్వారా ఏ ఫుడ్ ఏ టెంపరేచర్‌లో వండాలో తెలుసుకోండి. దీని గురించి మరిన్ని వివరాలు డాక్టర్ సుజాత స్టీఫెన్(చీఫ్ డైటీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) మాటల్లో తెలుసుకుందాం.

APSSDC : ఏపీ నర్సులకు జర్మనీలో బంపర్ ఆఫర్.. ‘ప్రాజెక్ట్ వసుధ’ ద్వారా భారీ జీతంతో ఉద్యోగాలు

APSSDC : అర్హతగల నర్సులకు వృత్తి అవకాశాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ప్రాజెక్ట్ వసుధ చేపట్టిన విషయం తెలిసిందే. దీని కింద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నర్సులు భాషా శిక్షణ, ఉపాధి కోసం జర్మనీకి వెళ్లారు.

తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు వెళ్లే భక్తులకు అలర్ట్.. తిరుపతి నుంచి ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది

0
Tirupati To Vijayawada Special Train 07606: ఏపీలో రైలు ప్రయాణికులు, తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుపతి, విజయవాడ మధ్య ప్రయాణించే వారికి ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 20న ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుపతి-విజయవాడ మధ్య ఆదివారం ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. రైలు నంబర్ 07606 తిరుపతి-విజయవాడకు.. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07605 విజయవాడ-తిరుపతికి అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. క్లీన్ స్వీప్‌పై భారత్ గురి.. వైభవ్‌కు ఛాన్స్ వచ్చేనా..!

0
ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న 3వ టీ20కి ముందు టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌ల ధనాధన్ ఇన్నింగ్స్‌లతో భారత్ అలవోకగా గెలిచింది. మరోవైపు పవర్‌ప్లే వైఫల్యాలు, బౌలర్లు తేలిపోవడంతో ఆఫ్ఘన్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఆఖరి పోరులో బెంచ్ స్ట్రెంగ్త్‌ను పరీక్షించేందుకు భారత్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చే యోచనలో ఉంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది.

మా తాతకి 3300 ఎకరాల భూమి ఉండేది.. నేనే 300 ఎకరాలు అమ్మేశా..: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

0

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణల నేపథ్యంలో రాజకీయ నాయకుల భూముల వ్యవహారం చర్చనీయాంశమైంది. కేసీఆర్‌, ఆయన కుటుంబం, సమీప బంధువుల పేరిట 439.30 ఎకరాల భూములు ఉన్నట్లు సీఎం వివరించారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సంబంధించిన పాత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన తాతకు 3,300 ఎకరాల భూమి ఉండేదని.. వారసత్వంగా తమకు వందల ఎకరాల భూములు వచ్చాయని చెప్పుకొచ్చారు.

నరాల బలహీనత తగ్గించే వ్యాయామాలు

0
మీ నరాలు బలహీనంగా మారుతున్నాయా. అయితే ఈ వ్యాయామాలు రోజూ చేయండి. తద్వారా నరాల బలహీనత తగ్గించుకోవచ్చు.