మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహార అలవాట్ల వల్ల నేడు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఫ్యాటీ లివర్. కాలేయంలో అధికంగా కొవ్వు చేరడం వల్ల మొదలయ్యే ఈ సమస్య ప్రారంభంలో ఎలాంటి తీవ్రమైన లక్షణాలను చూపించదు. అయితే దీనిని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే క్రమేణా కాలేయ కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి తీవ్రమైతే ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్ వంటి ప్రమాదకరమైన కాలేయ వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. కానీ సరైన సమయంలో లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సులభంగా చెక్ పెట్టొచ్చు.
మన ఇంటి వంటగదిలోనే అందుబాటులో ఉండే కొన్ని సహజ పదార్థాలు కాలేయ ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి. రోజూ తాగా బ్లాక్ కాఫీ, అల్లం-పసుపు టీ, చిన్న వెల్లుల్లి రెబ్బలు తినడం వంటివి కాలేయంలోని కొవ్వును కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మందులపై ఆధారపడకుండా ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న సహజ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్యను ఇంట్లోనే సురక్షితంగా తగ్గించుకోవచ్చు.


