గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ.. ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ యాత్రను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వారణాసిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం నిర్మాణానికి అయోధ్యలో ఐదు నుంచి పది ఎకరాలు స్థలం కేటాయించాలని కోరారు.
అసలు మూసి ఉన్న బియ్యం డబ్బాలోకి పురుగులు ఎలా వస్తాయో తెలుసా? వదిలించుకునే సులువైన చిట్కాలు!
భారతదేశంలో లక్షలాది కుటుంబాల భోజనంలో బియ్యం, పప్పుదినుసులు ప్రధాన భాగం. అయితే, బయట కొని తెచ్చిన తర్వాత కొన్ని రోజులకే బియ్యం లేదా పప్పులకు పురుగు పడుతుంది. ఈ చిన్న పురుగులు ఏమీ గమనించకముందే నాణ్యత, పోషక విలువలు, భద్రతను ప్రభావితం చేయగలవు. గాలి చొరబడని మూతలు పెట్టి భద్రపరిచినా బియ్యం, పప్పుల డబ్బాల్లో చిన్న చిన్న పురుగులు కనిపించడం సర్వసాధారణం.
ఇది వంటింటి అపరిశుభ్రత వల్ల వచ్చే సమస్య కాదు. మనం దుకాణం నుంచి ధాన్యం కొనుగోలు చేసేటప్పటికే ఈ సమస్య మొదలవుతుంది. గాలి చొరబడని మూసి ఉన్న బియ్యం లేదా పప్పుల డబ్బాల్లోకి పురుగులు ఎలా వస్తాయో స్టడీ ఆఫ్ బయోలాజికల్ టైమ్స్ తెలిపింది. మూసి ఉన్న డబ్బాల్లోకి పురుగులు ఎలా వస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన జాగ్రత్తలు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

