Home Blog Page 157

14 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలో కుజ, గురు గ్రహాల కలయిక వల్ల ఈ 4 రాశులకు ఆర్థిక ప్రయోజనాలు!

0
Guru Mangal Yuti 2026: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో కుజుడిని ధైర్యం, శక్తి, ఉత్సాహానికి సంకేతంగా భావిస్తారు. గురుడిని మేధస్సు, మార్గదర్శకత్వానికి అధిపతిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన శుక్రవారం నాడు సాయంత్రం 5:03 గంటలకు కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో ఇప్పటికే గురుడు నివాసం ఉంటున్నాడు. ఈ రెండు గ్రహాల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నాడు. చంద్రుడు అధిపతిగా కర్కాటక రాశిలో గురు, కుజ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు అనేక కొత్త అవకాశాలు లభించొచ్చు. ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులు తిరిగి ప్రారంభం కావడమే కాదు. మీ ప్రణాళికలన్నీ విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా గురు, కుజుల కలయికతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రాతపరీక్ష తేదీలు ఇవే, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటన

0

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక ప్రకటన వెలువడింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల రాతపరీక్షల తేదీలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటించింది. ఎస్‌ఐ పోస్టులకు నవంబర్ 29న.. కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 5,77,064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్‌ఐ పోస్టులకు 1,60,756 మంది.. కానిస్టేబుల్ పోస్టులకు 3,89,356 మంది దరఖాస్తు చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల జాబితా షెడ్యూల్ రిలీజ్, మళ్లీ ఓటు నమోదు

0

తెలంగాణలో ఖాళీ కానున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు ఎన్నికల అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్.. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు. ఈనెల 28న ప్రజా నోటీసు జారీ చేయనుండగా.. నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 25న ముసాయిదా జాబితా, డిసెంబర్ 30న తుది జాబితా విడుదల కానుంది. ఇప్పటికే ఓటరుగా నమోదైన పట్టభద్రులు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాల్సి ఉంటుంది.

అమెరికాలో 64 మందిని మోసం చేసి రూ.335 కోట్ల కొట్టేసిన భారత సంతతి వ్యక్తి.. 11 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి పెట్టుబడి మోసాలకు పాల్పడి.. ఇన్వెస్టర్ల వద్ద నుంచి ఏకంగా రూ.330కిపైగా కోట్లను కాజేశాడు. ఈ కేసులో అతడ్ని దోషిగా నిర్దారించిన అమెరికా కోర్టు.. పదకొండేళ్లు జైలు శిక్ష విధించింది. ఇది 1920ల నాటి అమెరికాలో ఇటలీ మోసగాడు పోంజి స్కీమ్‌ను పోలి ఉందని కోర్టు అభిప్రాయపడింది. బాధితుల్లో 64 మంది ఉండగా.. వీరిలో అమెరికా పాప్ సింగర్ భర్త ఒకరు కావడం గమనార్హం.

పృథ్వీ షాకు మరో షాక్.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్న కాబోయే భార్య..!

0
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ ఎంగేజ్‌మెంట్‌ రద్దు అయింది. ఈ విషయాన్ని ఆకృతి అగర్వాల్.. సోషల్ మీడియా పోస్టు ద్వారా ప్రకటించారు. మార్చి 8న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, సరిగ్గా ఆరు నెలలకే విడిపోతున్నట్లు గురువారం వెల్లడించారు. ఇద్దరి భవిష్యత్తు లక్ష్యాలు, ఆలోచనలు వేరుగా ఉండటం వల్లే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఆకృతి తెలిపారు. తమ ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తొలగించాడు.

Crime Thriller OTT: పెద్ది విలన్ హీరోగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 8.1 ఐఎండీబీ రేటింగ్.. రైలు టికెట్ల స్కామ్

0

Crime Thriller OTT: ఓటీటీలోకి లేటెస్ట్ గా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రైమ్ వీడియో ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా చూసే వీలున్న ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

శరీరంలో ప్రోటీన్ లోపిస్తే కనిపించే మొదటి లక్షణాలు, ఆహారంలో ప్రోటీన్ పెంచుకోవడానికి ఎక్స్‌పర్ట్ చెప్పిన చిట్కాలు!

0
మనిషి శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఎన్నో పోషకాలు అవసరం. పోషకాలు కేవలం ఆకలిని నివారించడమే కాదు. అవి శరీర పెరుగుదల, మరమ్మత్తు, కండరాల నిర్మాణానికి అత్యవసరం. అలాంటి వాటిలో ప్రోటీన్ అత్యంత ముఖ్యమైంది. కండరాల దృఢత్వానికి, రోగనిరోధక శక్తికి, శరీర కణజాలాల మరమ్మత్తుకు అలాగే హార్మోన్లు, ఎంజైమ్‌ల విడుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యం.

​ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే నిరంతర అలసట, నీరసం, కండరాల బలహీనత, తరచూ ఆకలి వేయడం, వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత త్వరగా కోలుకోలేకపోవడం, క్రమంగా కండరాల పరిమాణం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావొచ్చు కాబట్టి వీటిని కేవలం ప్రోటీన్ లోపంగానే నిర్ధారించలేము. అసలు ఒక వ్యక్తికి రోజూ ఎంత ప్రోటీన్ అవసరం? ప్రోటీన్ లోపం లక్షణాలు, డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి అన్న ప్రశ్నలకు డాక్టర్ సుజాత స్టీఫెన్ (చీఫ్ డైటీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) సమాధానం ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BP+ గుండెపోటు + కొలెస్ట్రాల్‌ + పెరాలసిస్‌ + బ్రెయిన్‌ స్ట్రోక్‌ రాకుండా కాపాడే అవిసె గింజలు, వీటిని ఎలా తీసుకోవాలంటే?

0
ప్రస్తుతం యాంత్రిక జీవన విధానంలో గుండె సంబంధిత సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్‌లు, పక్షవాతం, బీపీ వంటివి వయసుతో సంబంధం లేకుండా పెరిగిపోతున్నాయి. అడ్డదిడ్డమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి వంటి వాటి వల్ల రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోయి ప్రాణాపాయ స్థితిని దారితీస్తోంది. అయితే మన రోజువారీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. దీనికి అద్భుతమైన నివారణ మార్గం ఓమెగా-3 ప్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం.

ముఖ్యంగా మన వంటింట్లో సులభంగా దొరికే అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడకుండా నిరోధించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తప్రసరణను క్రమబద్ధీకరించి మెదడుకు రక్తం గడ్డకట్టకుండా చూసి స్ర్టోక్‌ ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఈ సహజసిద్ధమైన ఆహారంతో బీపీ, హార్ట్‌ ఎటాక్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌ను ఎలా అరికట్టవచ్చో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

Tirupati Special Trains : సెప్టెంబర్ 20న తిరుపతి-విజయవాడ మధ్య స్పెషల్ ట్రైన్స్

Tirupati Special Trains : ప్రయాణికుల రద్దీ కారణంగా తిరుపతి-విజయవాడ మధ్య సెప్టెంబర్ 20వ తేదీన ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ట్రైన్స్ ఎక్కడ ఆగుతాయో చూడండి.

రూ.100కు ఐదు కిలోల నుంచి కిలో రూ.70కి.. భారీగా పెరిగిన ఉల్లి ధర.. వంటల్లో ఆనియన్స్‌కు ప్రత్యామ్నాయాలేంటి?

0

రెండు నెలల క్రితం వంద రూపాయలకు ఐదు కిలోల చొప్పున ఉల్లిపాయలను విక్రయించారు. ట్రాలీ ఆటోల మీద వీధి వీధి తిరిగి మరీ సరసమైన ధరలకే ప్రయివేట్ వ్యక్తులు ఉల్లిపాయలను విక్రయించారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అవే ట్రాలీ ఆటోల మీద కిలో రూ.70 చొప్పన విక్రయిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఉల్లి ధర త్వరలోనే సెంచరీకి చేరువయ్యేలా ఉంది. ఉల్లి ధరల ఇంతలా పెరగడానికి కారణమేంటి? వంటల్లో ఉల్లికి ప్రత్యామ్నాయమేంటో చూద్దాం.