భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ ఎంగేజ్మెంట్ రద్దు అయింది. ఈ విషయాన్ని ఆకృతి అగర్వాల్.. సోషల్ మీడియా పోస్టు ద్వారా ప్రకటించారు. మార్చి 8న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, సరిగ్గా ఆరు నెలలకే విడిపోతున్నట్లు గురువారం వెల్లడించారు. ఇద్దరి భవిష్యత్తు లక్ష్యాలు, ఆలోచనలు వేరుగా ఉండటం వల్లే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఆకృతి తెలిపారు. తమ ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. పృథ్వీ షా తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంగేజ్మెంట్ ఫోటోలను తొలగించాడు.


