బరువు తగ్గాలని చూసేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో మొలకల పోహా చేసుకుని తినొచ్చు. దీని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం.
కిడ్నీలు ఫెయిల్ అయ్యేదాకా ఎదురుచూడకండి, ఇప్పుడు చెప్పే లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి!
భారతదేశంలో కిడ్నీ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD), కిడ్నీలో రాళ్లు, అక్యూట్ కిడ్నీ ఇంజురీ వంటి అనేక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. భారత్‌లోని పెద్దవారిలో దాదాపు 13% నుంచి 16% మంది CKD సమస్యతో బాధపడుతున్నారు. ఆశ్చర్యకరంగా పట్టణ ప్రాంతాల (10.65%) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే (15.34%) ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాల్ని తొలగించడం, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడడం మూత్రపిండాల ప్రధాన పని. ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక మాంసాహారం, మితిమీరిన ఉప్పు వాడకం, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లు కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారి కిడ్నీ ఫంక్షన్ టెస్టులు (KFT) చేయించుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసింది. అసలు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT) అంటే ఏంటి, అందులో ఏయే పరీక్షలు ఉంటాయి, ఏ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్న పూర్తి వివరాల్ని డాక్టర్ క్రిస్టిన్ జార్జ్ (కన్సల్టెంట్ – నెఫ్రాలజిస్ట్ & రీనల్ ట్రాన్స్‌ప్లాంట్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) అందించారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
ఏపీలో రూ.1.45 లక్షల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు.. చంద్రబాబును కలిసిన ప్రతినిధులు
Andhra Pradesj BPCL Refinery Project With Rs 1.45 Lakh Crores: ఆంధ్రప్రదేశ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. బీపీసీఎల్ సీఎండీ సంజయ్ ఖన్నా, ఇతర అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్‌పై చర్చించగా.. ఈ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం 75శాతం భూములు అప్పగించామన్నారు. వచ్చే నెలలో మిగిలిన భూమిని అప్పగిస్తామన్నారు. బీపీసీఎల్ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1.45 లక్షల కోట్లకు చేరిందని సంస్థ సీఎండీ సీఎంకు తెలిపారు.
Panna Mine Diamond: తెలంగాణ ఎన్‌ఎండీసీకి దొరికిన అరుదైన వజ్రం.. విలువ ఎన్ని కోట్లంటే..?
మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనిలో తెలంగాణ సంస్థ ఎన్‌ఎండీసీకి 27.29 క్యారెట్ల వజ్రం లభించింది. గని చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వజ్రంగా సంస్థ తెలిపింది. దీని ధర రూ.2–2.5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సంస్థ సీఎండీ చెప్పారు. దక్షిణాసియాలో ఏకైక యాంత్రీకృత వజ్రాల గనిగా పన్నా ప్రాజెక్టు కొనసాగుతోందన్నారు. సంవత్సరానికి 84 వేల క్యారెట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ గనిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు 6 వేల క్యారెట్ల వజ్రాలు ఉత్పత్తయ్యాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కీలక నిర్ణయం.. అగ్నిమాపకశాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు రాతపరీక్షలు
AP Fire Department Driver Posts New Rule: ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ 2050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో అగ్నిమాపకశాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిమాపకశాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సైతం దేహదారుఢ్య, రాతపరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో ఈ పోస్టులకు కేవలం ఫిజికల్ మెజర్‌మెంట్, డ్రైవింగ్ టెస్ట్ మాత్రమే ఉండేది.. కానీ ఈసారి ఆ రూల్ మార్చేశారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి.
LB Nagar Metro Skywalk: మెట్రో దిగగానే నేరుగా గేటెడ్ కమ్యూనిటీకి.. తొలిసారి రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌కు స్కైవాక్
హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి 3,576 ఫ్లాట్లతో నిర్మిస్తున్న వాసవి ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీకి నేరుగా చేరుకునేలా స్కైవాక్ నిర్మించనున్నారు. రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌కు మెట్రో అనుసంధానంగా నిర్మిస్తున్న తొలి స్కైవాక్ ఇదేనని వాసవి గ్రూప్ తెలిపింది. ట్రాఫిక్ పోలీసుల ఎన్‌వోసీతో పాటు అవసరమైన అనుమతులు లభించాయన్నారు. రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ స్కైవాక్‌కు ఐఐటీ హైదరాబాద్ డిజైన్ రూపొందించింది. ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ర్యాంప్, లిఫ్ట్, మెట్ల సదుపాయాలు ఉంటాయి.

