HomeHeadlinesఏపీలో రూ.1.45 లక్షల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు.. చంద్రబాబును కలిసిన ప్రతినిధులు

ఏపీలో రూ.1.45 లక్షల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు.. చంద్రబాబును కలిసిన ప్రతినిధులు

Andhra Pradesj BPCL Refinery Project With Rs 1.45 Lakh Crores: ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. బీపీసీఎల్‌ సీఎండీ సంజయ్‌ ఖన్నా, ఇతర అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్‌పై చర్చించగా.. ఈ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం 75శాతం భూములు అప్పగించామన్నారు. వచ్చే నెలలో మిగిలిన భూమిని అప్పగిస్తామన్నారు. బీపీసీఎల్‌ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1.45 లక్షల కోట్లకు చేరిందని సంస్థ సీఎండీ సీఎంకు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments