పశ్చిమ బెంగాల్‌లో రెండు స్థానాలకు ఉప-ఎన్నికలు జరిగితే.. అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ ప్రతిపక్షానికి కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభంతో చివరకు ఆ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇది ఉప-ఎన్నికల్లో స్పష్టంగా వెల్లడయ్యింది. రెండు వర్గాలుగా చీలిపోవడంతో పార్టీ పేరు, గుర్తుపై చట్టపరమైన పోరాటం కొనసాగుతోంది. దీంతో ఈ రెండు వర్గాలు వేర్వేరు పేర్లు, గుర్తులతో పోటీచేశాయి.


