దేశంలోని రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని ఐదు స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల్లో అధికార పార్టీల హవా కొనసాగింది. తమిళనాడులోని రెండు చోట్ల సీఎం విజయ్ పార్టీ టీవీకే, పుదుచ్చేరిలోని సీఎం రంగసామి పార్టీ ఎన్ఆర్ కాంగ్రెస్ గెలుపొందింది. ఇక, పశ్చిమ బెంగాల్లో రెండు సీట్లు బీజేపీ ఖాతాలోకి వచ్చాయి. నందిగ్రామ్‌లో రికార్డుస్థాయి విజయం అందుకుంది. అక్కడ బీజేపీ అభ్యర్థి 1.22 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి, రికార్డులను తిరగ రాశారు.


