AP Govt Gives Clarity That Ration Card And Aadhaar As Proof Of Residence: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్స్ ప్రూఫ్, రెసిడెన్స్ సర్టిఫికెట్లకు సంబంధించి మరో జీవోను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ఆధార్, రేషన్ కార్డులను నివాస ధ్రువీకరణకు ఉఫయోగించుకోవాలని తెలిపింది. ప్రత్యేకంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ (Residence Certificate) తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
నిమిషంలోనే సెట్ దోశ, నానబెట్టే పనేలేదు పులవాల్సిన అవసరం లేదు, పప్పుల్లేకుండానే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
సెట్ దోశ.. చాలా మంది ఇష్టంగా తింటారు. నార్మల్ దోశల కంటే ఇవి కాస్తా చిన్నగా దళసరిగా ఉంటాయి. ఈ దోశల్లో చిన్న చిన్న బబుల్స్ బోలెడు ఉంటాయి. ఎంతో స్పాంజీగా ఉంటాయి. మెత్తగా చక్కగా ఉంటాయి. అందుకే, సెట్ దోశలంటే చాలా మందికి ఇష్టం. అయితే, వీటిని చేయాలంటే ముందుగా మినపప్పు, బియ్యాన్ని నానబెట్టడం వంటి పనులు ఉంటాయి. కానీ, ఆ కష్టమే లేకుండా అప్పటికప్పుడు కూడా ఈ సెట్ దోశల్ని చేసుకుని తినొచ్చు. దీనికోసం ఓ చక్కని ఐడియాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం నిమిషాల్లోనే పిండిని తయారుచేసుకుని దోశలు చేసుకుని హ్యాపీగా తినొచ్చు. మరి ఇన్‌స్టంట్ దోశకి పిండిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.
రాశిఫలాలు 18 సెప్టెంబర్ 2026: నీచభంగ రాజయోగం వేళ కన్య సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం!
రాశిఫలాలు 18 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు కుజుడు మిథునం నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో గురుడితో కలయిక జరపనున్నాడు. ఈ సమయంలో నీచభంగ రాజయోగం, ప్రీతి, ఆయుష్మాన్ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో తులా సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
ఆఫ్ఘన్‌కు భంగపాటు.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్..!
ఢిల్లీలో జరిగిన మూడో టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌ను 127 పరుగుల తేడాతో ఓడించి భారత్ 3-0తో సిరీస్ చేజిక్కించుకుంది. తొలుత అభిషేక్ శర్మ (108) రికార్డు సెంచరీ, సంజూ శాంసన్ (50) ఫిఫ్టీతో భారత్ 221/7 సాధించింది. భారీ ఛేదనలో భారత బౌలర్లు గుంపుగా దాడి చేశారు. నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీసి చెలరేగడంతో ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్థాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటైంది.

