Home Blog Page 148

యుద్ధం కొత్తేం కాదు, ఉపఎన్నికలకు రెడీ.. విజయం సాధిస్తా.. అనర్హతపై దానం రియాక్షన్

0

హైకోర్టు తనపై అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని.. ప్రస్తుతానికి సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. ఉపఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నానని.. రాజకీయ పోరాటాలు తనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. మళ్లీ ప్రజాక్షేత్రంలో పోరాడి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల వివాదంతో మొదలైన అనర్హత వ్యవహారంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్‌లో ఉపఎన్నికపై రాజకీయ చర్చ మొదలైంది.

Comedy Web Series: సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో స్ట్రీమింగ్ డేట్

0

Comedy Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో కామెడీ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త సీజన్ రానుందంటూ అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

పూజల్లో కొట్టే కొబ్బరికాయతో క్షణాల్లో అదిరిపోయే స్వీట్ చేసేయండి, ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు

0
​కొకొనట్ పుడ్డింగ్. ఎంతో క్రీమీ అండ్ డెలీషియస్‌గా ఉండే ఈ స్వీట్‌ని చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. పూజల్లో కొట్టిన కొబ్బరిని పక్కనపెట్టేయకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర్నుంచీ పెద్దవారి వరకూ ఈ స్వీట్‌ని చక్కగా తింటారు. కేవలం రెండు, మూడు పదార్థాలతో తయారయ్యే ఈ వంటకం చక్కగా ఎంతో రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే వెన్న ముద్దలా కరిగిపోతుంది. ఈ స్వీట్ రెసిపీలో వాడే పదార్థాలన్నీ కూడా ఇంట్లో ఉండేవే. వాటితో హ్యాపీగా నిమిషాల్లోనే ఈ స్వీట్ రెసిపీని చేసుకుని తినొచ్చు. చక్కగా కేక్‌లా ఉంటుంది. కాబట్టి, మీరు ఏవైనా సెలబ్రేషన్స్ టైమ్‌లో కేక్‌లా కూడా చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రేమ.. ప్రతీకారం.. మిగిలింది ఆరని కడుపుకోత.. వైష్ణవి, హరిబాబుల స్టోరీ నేటి యువతకు ఓ చేదు పాఠం!

0
వివాహ బంధం విఫలమైతే విడిపోవడానికో లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికో దారులుంటాయి తప్ప భాగస్వామి ప్రాణాలు తీయడం పరిష్కారం కాదు. అమ్మాయి తన భర్త చేతిలోనే బలవ్వడం ప్రేమ అనే పదానికి జరిగిన ఘోర పరాభవం కాగా ఆపై ఆమె సోదరుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతీకారంతో ఆమె భర్తను అంతమొందించడం సమాజంలో రగులుతున్న ఆవేశానికి పరాకాష్ట. ప్రేమ పేరిట జరిగిన ఒక తప్పదం, ప్రతీకారం పేరిట మరొక పాపానికి బాటలు వేసి చివరికి రెండు కుటుంబాలను కోలుకోలేని శోకసంద్రలో ముంచేసింది.

వేటు పడుతుందని తెలిసినా.. వెనక్కి తగ్గలేదా? దానం నాగేందర్ అసలు ప్లాన్ వేరే ఉందా..?

0

తనపై అనర్హత వేటు పడుతుందని దానం నాగేందర్‌ ముందుగానే ఊహించారా. ఒకవేళ వేటు పడినా తాను ఏం చేయాలి అనేది ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నారా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆయన రాజకీయ వ్యూహాలపైనా చర్చ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వచ్చినా.. ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆయన ముందుగానే నిర్ణయించుకున్నారా. అసలు ఆయన ప్లాన్ ఏంటి?

స్కూల్‌ మెట్లపైనుంచి పడి నాలుగో తరగతి విద్యార్థిని మృతి.. షాద్‌నగర్‌లో విషాదం

0

షాద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల మెట్లు దిగుతుండగా జారిపడిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ బాలిక మెట్లపై నుంచి పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మరోవైపు ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం తమకు సరైన సమాచారం ఇవ్వలేదని విద్యార్థిని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతితో కుటుంబంలో, పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది.

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా పార్థివ్ పటేల్.. అగార్కర్‌కు చెక్ పడటం ఖాయమేనా!

0
టీమిండియా పురుషుల సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనుండటంతో, అతని స్థానంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చీఫ్ సెలెక్టర్‌గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ రివ్యూ మీటింగ్‌కు అగార్కర్ గైర్హాజరు కావడం ఈ ఊహాగానాలకు బలాన్నిచ్చింది. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల నేపథ్యంలో కొత్త సెలెక్టర్ నియామకంపై కొన్ని వారాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ప్రకృతి పులకరించేలా పండగలు.. ఇలా చేసుకోండి

0
ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండా పండగలు చేసుకునేందుకు సాయపడే కొన్ని చిట్కాల గురించి ఇక్కడ వివరించాం.

బరువు తగ్గడానికి మీకు సాయపడే 4 రకాల గింజలు, పరిశోధనల ప్రకారం ఏమేం తినాలో తెలుసా?

0
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా బరువు తగ్గడం అంటే తక్కువ తినడం లేదా కఠినమైన డైట్ పాటించడం అనుకుంటారు. కానీ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. అలాంటి వాటిలో గింజలు ఒకటి. గింజలు శరీరానికి అవసరమైన పోషకాల్ని అందిస్తూ బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేసి అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి. గింజల్లో ఉండే ఫైబర్ కడుపు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. ప్రోటీన్, ఫైబర్ కలయిక వల్ల ఆకలి తర్వగా వేయదు. ఆహారంలో చేర్చడం కూడా సులువుగా ఉంటుంది. బరువు తగ్గడానికి సాయపడే 4 రకాల గింజలు, వాటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

AP Fire Services : ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు – నోటిఫికేషన్ జారీ, ఈసారి కొత్త రూల్స్

AP Fire Services Driver Operator Notification : ఆంధ్రప్రదేశ్ విపత్తులు, అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఏపీ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి ఎంపిక ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేసి దేహదారుఢ్య (పీఈటీ), రాత పరీక్షలను తప్పనిసరి చేశారు.