గాయపడిన పేసర్ హర్షిత్ రాణా స్థానంలో విదర్భ బౌలర్ యష్ ఠాకూర్‌ను అఫ్గనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌తో పాటు ఆసియా గేమ్స్ భారత జట్టులోకి బీసీసీఐ ఎంపిక చేసింది. రీహాబ్‌లో మ్యాచ్ సిమ్యులేషన్ బౌలింగ్ చేస్తుండగా హర్షిత్ రెక్టస్ ఫెమోరిస్ గాయానికి గురయ్యాడు. దీంతో జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు ఫిట్‌నెస్ నిరూపించుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు అప్‌డేటెడ్ స్క్వాడ్‌లో స్థానం దక్కించుకున్నారు. సెప్టెంబర్ 13న భారత్, అఫ్గన్ తొలి టీ20 జరగనుంది.


