తొలకరి చినుకుల తడిలో మట్టి పరిమళించినట్లు, ప్రతి ఇంట్లో మంటపాల అలజడితో వినాయక చవితి పండుగ (Ganesh Chaturthi 2026) కళ సంతరించుకుంది. కొన్ని కొత్త పరిచయాలకు, పెనవేసుకునే బంధాలకు కూడా నిలయంగా మారింది. చందనం వాసనలు, మైకుల్లో సుప్రభాతాల హోరు నడుమ అనుకోకుండా కలిసిన రెండు మనసులు ఒకరినొకరు అర్థం చేసుకునే పనిలో పడ్డాయి. పూజా ద్రవ్యాలు తేవడంలో చిన్నపాటి గొడవలు, పందిరి అలంకరణలో పంచుకున్న చిలిపి చూపులు వారి మధ్య తెలియని చొరవను పెంచాయి.
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి సాక్షిగా, వారిద్దరి మనసుల్లోని సందేహాలనే విఘ్నాలు కూడా ఒక్కొక్కటిగా కరిగిపోసాగాయి. ఉత్సవాల సందడి వారి చుట్టూ ఉన్నా వారి చూపులు మాత్రం ఒకరినొకరు వెతుక్కుంటూ శబ్దాల నడుమ ఒక నిశ్శబ్ద ప్రయాణం చేశాయి. లడ్డూ వేలం పాట హోరాహోరీగా సాగతుంటే, వీరు మాత్రం తమ భవిష్యత్తుపై కొత్త ఆశల వేలం వేసుకుంటున్నారు. పండుగ సంతోషం ఊరంతా ఉంటే, బొజ్జ గణపయ్య మాత్రం ఈ జంట మధ్య ఒక తీపి బంధానికి నిశ్శబ్దంగా శ్రీకారం చుట్టాడు..


