చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో సౌత్ జోన్‌పై ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తద్వారా 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ దులీప్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచింది. ఇషాన్ కిషన్ (270, 80) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ ట్రోఫీ ఆద్యాంతం రాణించిన తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు.


