అఫ్గనిస్థాన్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరమైన స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించాడు. అయితే ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాల ఫిట్‌నెస్‌పై సెప్టెంబర్ 9న తుది నిర్ణయం వెలువడనుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కూడా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి.


