వయసు మోసానికి (ఏజ్ ఫ్రాడ్) పాల్పడిన యువ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి కఠిన చర్యలు తీసుకుంది. అతడిపై రెండేళ్ల నిషేధం విధించడంతో పాటు భారత్ అండర్-19 జట్టు నుంచి తప్పించింది. రాబోయే ఆస్ట్రేలియా అండర్-19 సిరీస్ కోసం రోహిత్ స్థానంలో వన్డే మ్యాచ్‌లకు సౌరాష్ట్రకు చెందిన ఆర్యన్ సవ్సనిని, మల్టీ-డే మ్యాచ్‌లకు హర్యానాకు చెందిన క్రికెటర్ తన్మయ్ బలోడాను సెలక్టర్లు ఎంపిక చేశారు.


