చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రికార్డు డబుల్ సెంచరీతో (270) చెలరేగాడు. 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడటంతో పాటు కుమార్ కుషాగ్రా (101) కూడా రాణించడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల కొండంత స్కోరు సాధించింది. 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెండో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్, టీమిండియా టెస్టు జట్టులోకి రీ-ఎంట్రీ సాధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చాటిచెప్పాడు.


