చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు విజయం వైపు దూసుకెళ్తోంది. ఈస్ట్ జోన్ సాధించిన 708 పరుగుల స్కోరుకు సమాధానంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. సౌత్ జోన్ ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. మహమ్మద్ షమీ, ముకేష్ కుమార్లు రెండేసి వికెట్లు పడగొట్టారు. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (56*) అర్థశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు.


