HomeNation and World13 ఏళ్ల నాడు 29 మంది ప్రాణాలు తీసిన బస్తర్ దాడి కేసులో.. 10 మందిని...

13 ఏళ్ల నాడు 29 మంది ప్రాణాలు తీసిన బస్తర్ దాడి కేసులో.. 10 మందిని దోషులుగా తేల్చిన కోర్టు!

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 2013లో సంభవించిన భయంకరమైన జీరామ్ వ్యాలీ మావోయిస్టుల దాడి కేసులో ప్రత్యేక ఎన్‌ఐఏ న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. కాంగ్రెస్ అగ్ర నాయకులు సహా 29 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఘోర ఘటనలో ఇద్దరు మహిళలతో సహా 10 మందిని దోషులుగా తేలుస్తూ జగదల్‌పూర్ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. దాదాపు 101 మంది సాక్షుల విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడగా.. శిక్షల వివరాలను సెప్టెంబర్ 16వ తేదీన వెల్లడించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments