మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో ఆమె భవిష్యత్తు కార్యాచారణ ఏంటి? అనేది ఆసక్తి రేపుతోంది. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడుతారు? అనే ప్రచారం సాగుతోంది. మరి ఏ పార్టీలోకి వెళ్తారు? ప్రత్యామ్నాయం ఏంటి? అనేది రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని జరుగుతోన్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత తీవ్రస్థాయిలో స్పందించారు. తమ పార్టీ ఏమీ చెత్త డబ్బా కాదంటూ ఆయన హాట్ కామెంట్స్ చేయడం గమనార్హం.


