HomeNation and Worldసుప్రీంకోర్టు జడ్జినంటూ సుకేష్ చంద్రశేఖర్‌ బెదిరింపులు.. 8 ఏళ్ల జైలుశిక్ష వేసిన న్యాయస్థానం

సుప్రీంకోర్టు జడ్జినంటూ సుకేష్ చంద్రశేఖర్‌ బెదిరింపులు.. 8 ఏళ్ల జైలుశిక్ష వేసిన న్యాయస్థానం

ఒక కేసులో బెయిల్ పొందేందుకు ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తినంటూ నటిస్తూ స్పెషల్ జడ్జీని బెదిరింపులకు గురిచేసిన నేరగాడు సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగిలా నటించడం, బెదిరించడం వంటి నేరాలకు గాను విడివిడిగా శిక్షలు ఖరారు చేసి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలయ్యేలా జడ్జి తీర్పును ఇచ్చారు. న్యాయవ్యవస్థ సత్యనిష్ఠను దెబ్బతీసేలా సుకేష్ పాల్పడిన ఈ చర్య తీవ్రమైన వ్యవస్థాగత ద్రోహమని కోర్టు మండిపడింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments