శ్రీలంకతో కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. కుల్‌దీప్ యాదవ్ ఇన్ఫెక్షన్ వల్ల దూరం కావడంతో ఆల్ రౌండర్ సారాంశ్ జైన్ టెస్ట్ డెబ్యూ చేశాడు. లంక జట్టులో కామిల్ మిశ్రా అరంగేట్రం చేశాడు. 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ క్లీన్ స్వీప్ సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.


