Raksha Bandhan 2026: హిందూ పంచాగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రక్షా బంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన శ్రావణ శుక్రవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకోనున్నారు. రాఖీ అంటేనే సోదర సోదరీమణుల బంధాన్ని మరింత బలంగా మార్చేది. అంతేకాదు వారి మధ్య ఎన్ని గొడవలున్నా, ఎన్ని పొరపచ్చాలున్నా అవన్నీ తాత్కాలికమేనని, అయితే క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తమకు తోడుగా ఉండాలని కోరుకుంటూ తమ సోదరుని నుండి రక్షణను కాంక్షిస్తూ ప్రతి అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడతారని మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు తమ సోదరులు అన్ని చోట్లా విజయం సాధించాలని కోరుతూ, సన్నటి దారాన్ని ఎర్రని తోరణానికి చుట్టూ వారి చేతికి కట్టే వారు. తమ సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి, వారి సంతోషం, శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. ఈ నేపథ్యంలో ఈ పండుగ సమయంలో మీ సోదరుడికి ఏ రంగు దుస్తులు, ఎలాంటి రాఖీ కట్టాలని ఆలోచిస్తుంటే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీ రాశిని బట్టి సరైన రంగులను ఎంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ప్రతి రాశికి ఒక నిర్దిష్ట రంగు కేటాయించబడి ఉంటుంది. ఈ సందర్భంగా 12 రాశులకు ఏ రంగు రాఖీలు శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.
రాఖీ పౌర్ణమి 2026: మీ సోదరుల రాశిని బట్టి ఏ రంగు రాఖీ కట్టాలి? జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది!
RELATED ARTICLES


