Karthika Deepam Serial Today 23 August Episode కార్తీకదీపం సీరియల్లో ప్రస్తుతం సూరజ్ హవానే నడుస్తోంది. అతి మంచివాడిలా నటిస్తున్న సూరజ్ బాగోతం బయట పడేలా ఉంది. అతడ్ని నమ్మి శివన్నారాయణ కుటుంబం నిండా మునిగేలా కనిపిస్తోంది. పెళ్లి హడావిలో అందరూ ఉండగానే నమ్మించి సంతకాలు పెట్టించేలా చేశాడు సూరజ్. తాను ఎక్కడ దొరికిపోతానో అని సూరజ్‌కి దెబ్బకు చెమటలు కూడా పుట్టాయి. డాక్యుమెంట్లు చదవకుండా దీప అతి మంచితనంతో కార్తీక్‌ని కూడా అడ్డుకుంటుంది. దీంతో సూరజ్ పని కాస్త సులువు అయిపోయినట్టు కనిపిస్తుంది.


