కృష్ణాజిల్లా గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొని కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన చిరంజీవి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిరంజీవి నూతన చిత్రం టైటిల్ లాంచ్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.


