ప్రముఖ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహజ నటనకు పెట్టింది పేరు ఆమె. ప్రస్తుతం రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. ఇక, సాయి పల్లవి అంటే సహజత్వానికి, నో – మేకప్ లుక్‌కు పెట్టింది పేరు. సినీ ఇండస్ట్రీలో అందం అంటే మచ్చలేని ముఖం అనే మూసపద్ధతుల్ని బద్దలు కొడుతూ.. వెండితెరపై.. నిజజీవితంలోనూ తన సహజ చర్మాన్ని చూపిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ”
మొటిమలు, రోసేషియా (Rosacea) ఉన్న నన్ను ప్రేక్షకులు అలాగే ఆదరించినప్పుడు, ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని నాకు అర్థమైంది” అని పంచుకున్నారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం మొటిమలు, రోసేషియా చూడటానికి కాస్త ఒకేలా కనిపించినా.. రెండూ పూర్తిగా భిన్నమైన సమస్యలు. వాటికి తీసుకునే చికిత్స కూడా వేరుగా ఉంటుంది.


