జుట్టు ఎంత అందంగా ఉన్నా.. తలపై చుండ్రు కనిపిస్తే ఆ అందమంతా తగ్గినట్లు అనిపిస్తుంది. దుస్తులపై తెల్లటి పొట్టు రాలడం, తలలో దురద, పదేపదే గోక్కోవాల్సి రావడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రోజుల్లో మారుతున్న వాతావరణం, కాలుష్యం, ఒత్తిడి, తల సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలామందిని ఈ సమస్య వేధిస్తుంది. తలలో చర్మం పొడిబారిపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మం పొలుసులుగా రాలిపోతుంటుంది.
చుండ్రు సమస్యను దూం చేసుకోవడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వాడి విసిగిపోయారా? అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన వంటింట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో చుండ్రును సులభంగా తరిమికొట్టవచ్చు. చుండ్రును సమర్థవంతంగా తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


