ఈ రోజుల్లో లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. స్ట్రోక్ అనేది అత్యంత తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ). మెదడు కణాలకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు లేదా మెదడులోని రక్తనాళం చిట్లినప్పుడు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక బ్రెయిన్ కణాలు కొన్ని నిమిషాల్లోనే చనిపోవడం మొదలవుతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం కలగడం లేదా శరీరంలో ఏదో ఒక భాగం చచ్చుబడిపోయి పక్షవాతం రావడం జరుగుతుంది.
చాలామంది స్ట్రోక్ అకస్మాత్తుగా వస్తుందని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో స్ట్రోక్ రావడానికి కొన్ని వారాలు లేదా నెలల ముందు నుంచే శరీరం కొన్ని స్పష్టమైన ముందస్తు హెచ్చరిక సంకేతాల్ని పంపుతుంది. వీటిని సకాలంలో గుర్తిస్తే రోగిని ప్రమాదం నుంచి కాపాడవచ్చు. అక్టోబర్ 29న ప్రతి ఏడాది వరల్డ్ స్ట్రోక్ డే జరుపుకుంటారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా కొద్ది రోజుల ముందు నుంచి కనిపించే బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాల గురించి డాక్టర్ నితిన్ కుమార్. ఎన్ (సీనియర్ కన్సల్టెంట్ – న్యూరాలజిస్ట్, స్పర్ష్ హాస్పిటల్, హెన్నూర్ రోడ్, బెంగళూరు) తెలిపారు.


