దసరా ఉత్సవాలు ముగిశాయి. ఇక, ఇప్పుడు అందరూ దీపావళి సంబరాలకు సిద్ధమయ్యారు. ఇక, చాలా మంది దీపావళికి ఇల్లును మొత్తం శుభ్రం చేసుకుంటారు. దీపావళి పండుగ అంటేనే ఇంటిని సరికొత్తగా తీర్చిదిద్దుకుని పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించే సమయం. ఇల్లును శుభ్రంగా, చక్కగా సర్దుకుంటే పండుగ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇక, ఇంట్లో ప్రతి మూలను క్లీన్ చేయాల్సి ఉంటుంది. అయితే, వంటగదిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇంటి ఆరోగ్యం మొత్తం వంటగదిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే కిచెన్ క్లీనింగ్పై మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఈ దీపావళికి కిచెన్ క్లీనింగ్ సమయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన 7 ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.


