లంచం తీసుకుంటూ బంజారాహిల్స్ ఎస్సై ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ కేసు విషయంలో ఒక వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అందులో రూ.1 లక్ష తీసుకుంటుండగా.. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఎస్సైని పట్టుకున్నారు. బాధితులు ఇచ్చిన ఆడియో, వీడియో ఆధారాలను ఏసీబీ అధికారులు పరిశీలించి.. ప్రస్తుతం ఎస్సైని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను కూడా పరిశీలించారు.


