HomeHeadlinesప్రైవేటు స్కూళ్లకు సంబంధించి రూ.100 కోట్ల అవినీతి కేసు.. డీఎంకే మాజీ మంత్రి మహేశ్ అరెస్ట్

ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి రూ.100 కోట్ల అవినీతి కేసు.. డీఎంకే మాజీ మంత్రి మహేశ్ అరెస్ట్

తమిళనాడు మాజీమంత్రి, డీఎంకే నేత అన్బిల్ మహేశ్ పొయ్యామొళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు ఇప్పించే వ్యవహారంలో నమోదైన అవినీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సుమారు రూ.100 కోట్ల మేర అక్రమ వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో 177 పాఠశాలలు ప్రభావితమైనట్లు అధికారులు గుర్తించారు. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ కూడా మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసింది. ఈ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్య తీసుకున్నారని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments