బ్రెజిల్ ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం భారత్-బ్రెజిల్ సంబంధాలపై కొత్త అంచనాలకు దారితీసింది. ప్రస్తుతం 2 దేశాల మధ్య వాణిజ్యం 15.21 బిలియన్ డాలర్లు ఉండగా.. దాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సాధించాలంటే మెడిసిన్, కెమికల్స్, ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తులు, టెక్నాలజీ వంటి రంగాల్లో అవకాశాలను విస్తరించాలి. బ్రిక్స్ వేదికపై అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక ప్రాతినిధ్యం కల్పించే అంశాల్లో ఇరు దేశాలు సహకరించవచ్చు. రూపాయి-రియల్ లావాదేవీలు, కీలక ఖనిజాల సరఫరా, పునరుత్పాదక ఇంధన రంగాల్లోనూ కొత్త అవకాశాలున్నాయి.


