తమిళ రాజకీయాల్లో మరో సినిమా స్టార్ వస్తున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. ప్రముఖ నటుడు ధనుష్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. దీనికంతటికీ కారణం ఆయన అభిమాన సంఘం పేరును సేవ సంస్థగా మార్చడమే. ఇలాంటి తరుణంలో చెన్నైలో మహిళా అభిమానులతో ఆయన సమావేశం కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఆయన 3 వేల మందికి వెండి దీపాలను గిఫ్ట్‌లు ఇచ్చారు. వీటిపై బీజేపీ ఎన్నికల గుర్తు ఉండటం మరింత రచ్చ రేగుతోంది.


