Adani Total Gas: పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులపై అదనపు భారం వేస్తున్నాయి. కొద్ది రోజులుగా ధరల పెరుగుదల లేదని ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షాకిచ్చింది. సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన గ్యాస్ సేకరణ వ్యయాల కారణంతో సీఎన్జీ ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. కిలో సీఎన్జీ రూ.4 పైన పెంచింది. మరి కొత్త రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


