ఈ రోజుల్లో చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. హైబీపీని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు అనేది గుండె, ధమనులపై పడే ఒత్తిడిని సూచిస్తుంది. గుండె శరీరంలోని ప్రతి మూలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తపోటులో రెండు రకాల ఒత్తిడి ఉంటుంది. ఒకటి సిస్టోలిక్ ప్రెజర్, రెండోది డయాస్టోలిక్ ప్రెజర్. గుండె కొట్టుకున్నప్పుడు దానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల గోడలపై మీ రక్తం కలిగించే ఒత్తిడిని సిస్టోలిక్ బీపీని ప్రతిబింబిస్తుంది. గుండె ఆగినప్పుడు లేదా విశ్రాంతి తీసుకున్నప్పుడు ధమనుల గోడలపై పడే ఒత్తిడిని సిస్టోలిక్ రక్తపోటును ప్రతిబింబిస్తుంది.
రక్తపోటు అందరికీ ఒకేలా ఉండదు. వయసు పెరిగే కొద్దీ ఇందులో మార్పులు వస్తుంటాయి. మీ వయసుకు తగ్గ బీపీ ఎంత ఉండాలో తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలను ముందుగానే నివారించవచ్చు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో పబ్లిష్ అయిన నివేదిక ప్రకారం ఏ వయసు వారికి ఎంత బీపీ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.


