ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. కూటమికి సీట్ల సర్దుబాటు పెద్ద సవాల్గా మారింది. విశాఖ జీవీఎంసీ పరిధిలో కొన్నిచోట్ల సీట్ల పంపకం లెక్క ఇంకా తేలలేదు. దీంతో ఆయా స్థానిక నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. రీసెంట్గా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకత్వం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పొత్తులో భాగంగా తమకు తగినన్ని స్థానాలు కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని భీమిలి జనసేన ఇన్ఛార్జ్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు డాక్టర్ సందీప్ పంచకర్ల ఎక్స్ వేదికగా ప్రకటించారు.
నామినేషన్లు వేసేశాం.. సీట్లు ఇవ్వకుంటే పవన్ కటౌట్తో పోటీ చేస్తాం.. భీమిలిలో జనసేన స్థానిక నేతల హెచ్చరిక
RELATED ARTICLES


