తొలిరోజు నామినేషన్ లో ఉద్రిక్తత: రాళ్లదాడి – లాఠీచార్జ్ చేసిన పోలీసులుధర్మవరం: ధర్మవరం పట్టణంలో తొలిరోజు మున్సిపల్ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎన్డీఏ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో ఒక్కసారిగా గందరగోళం చోటుచేసుకుంది.పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అప్రమత్తమై రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లపై ఆరా తీసి దాడులకు పాల్పడిన వారిని తరిమికొట్టారు.మున్సిపల్ కార్యాలయంలో 1 నుంచి 28 వార్డులకు, బీఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 29 నుంచి 48 వార్డులకు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సజావుగా సాగిన నామినేషన్ ప్రక్రియ మధ్యాహ్నం తర్వాత ఉద్రిక్తంగా మారింది. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.ఈ ఘటనతో ధర్మవరంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. అనంతరం టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. శనివారం నుంచి మరింత అదనపు బలగాలను మోహరిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
#viralvideo #shortvideo #viralshorts
#ksnnewstelugu
#ksntelugunews
#ksnnews
#ksnnews9-telugu


